Lords Stadium : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త విజేతను చూడబోతున్నాం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia)కు షాకిస్తూ మూడో సీజన్లో దక్షిణాఫ్రికా (South Africa) విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్ మీద సఫారీ బ్యాటర్లు ఓపికగా ఆడి జట్టను పటిష్ట స్థితిలో నిలిపారు. ఓపెనర్‌గా వచ్చిన ఎడెన్ మర్క్రమ్(106 నాటౌట్) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. మరో ఎండ్‌లో తెంబ బవుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టిన ఈ జోడీ మూడో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది.
లార్డ్స్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో అత్యధిక స్కోర్‌తో చరిత్ర సృష్టించారు మర్క్రమ్, బవుమా. 147 రన్స్ జోడించిన ఈ ద్వయం భారత దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman), అజిత్ అగార్కర్(Ajith Agarkar)ల పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. 2002లో అగార్కర్, లక్ష్మణ్‌లు నాలుగో ఇన్నింగ్స్‌లో 126 పరుగులు చేశారు.
The vibes 😍 pic.twitter.com/e3HU3XyD5d
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2025
లార్డ్స్‌లో రికార్డు భాగస్వామ్యం మాత్రం వెస్టిండీస్ ఆటగాళ్ల పేరిట ఉంది. లారీ గోమ్స్, గోర్డన్ గ్రీనిడ్జ్లు 1986లో అజేయంగా 287 రన్స్ జోడించారు. రెండో స్థానంలో ఆసీస్ క్రికెటర్లు మైఖేల్ క్లార్క్, బ్రాడ్ హడిన్ ఉన్నారు. వీళ్లు 2009లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేస్తూ 126 రన్స్ రాబట్టారు. ఆస్ట్రేలియాకే చెందిన ఇయాన్ ఛాపెల్, రిక్ మెక్కొస్కర్లు 1975లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఐదో స్థానంలో కొనసాతున్నారు.