ఢిల్లీ: భారత మిక్స్డ్ డబుల్స్ ప్యాడ్లర్ల ద్వయం మనూష్ షా-దివ్య చిటాలె ద్వయం చరిత్ర సృష్టించింది. ఈనెల 10 నుంచి 14 మధ్య హాంకాంగ్ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్ టేబుల్‌టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫైనల్స్‌కు ఈ జోడీ అర్హత సాధించింది.
తద్వారా ఈ టోర్నీ చరిత్రలో మిక్స్డ్ డబుల్స్‌లో తొలిసారి చోటు దక్కించుకున్న జోడీగా రికార్డులకెక్కింది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఈ దశలో చైనా, హాంకాంగ్ వంటి కఠిన ప్రత్యర్థులతో తలపడనున్నారు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడనున్న ఈ జోడీ.. రెండింటిలో గెలిస్తే సెమీస్‌కు క్వాలిఫై అవుతుంది.