Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్ (Manu Bhaker) తీరిక సమయం గడుపుతోంది. ఒలింపిక్ విజేతగా స్వదేశంలో అడుగుపెట్టిన మను బ్రేక్ టైమ్‌లో హాబీలపై ఫోకస్ పెడుతోంది. అలాగని ఒకటో రెండో ఉన్నాయనుకుంటే పొరపాటే. అవును.. మను హాబీల జాబితాలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ.. భరతనాట్యం.. ఇలా చాలానే ఉన్నాయండోయ్. తాజాగా వీటిలో క్రికెట్ కూడా వచ్చి చేరింది. అవును.. మను ఈమధ్యే టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్(Surya kumarYadav)ను కలిసింది.
అతడితో దిగిన ఫొటోను ఎక్స్ ఖాతాలో పెట్టిన ఈ ఒలింపియన్.. ‘భారత దేశ మిస్టర్ 360 నుంచి కొత్త ఆటలో మెలకువలు నేర్చుకుంటున్నా’ అని క్యాప్షన్ రాసింది. మను పెట్టిన ఫొటోలో సూర్య పిస్టల్ పోజుతో ఉండగా.. ఆమె బ్యాట్ పట్టుకున్నట్టు స్టిల్ ఇచ్చింది. ఇంకేముంది ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఫ్యాన్స్ అయితే ‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ కామెంట్లు పెడతున్నారు.
Learning techniques of a new sport with the Mr. 360 of India! @surya_14kumar 💪 pic.twitter.com/nWVrwxWYqy
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 25, 2024
టోక్యో ఒలింపిక్స్ వైఫల్యంతో పాఠాలు నేర్చిన మను భాకర్.. పారిస్‌లో పతక గర్జన చేసింది. మాజీ కోచ్ జస్పాల్ రానా (Jaspal Rana) సలహాలతో మెరుగైన భాకర్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కంచు మోత మోగించింది. తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది. అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్లో మళ్లీ సత్తా చాటిన ఆమె కాంస్యంతో మెరిసింది. ఒలింపిక్స్ కోసం సుదీర్ఘంగా శిక్షణ పొందిన మను మూడు నెలలు బ్రేక్ తీసుకోనుంది. దాంతో, అక్టోబర్‌లో ఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్ వరల్డ్ కప్(shooting world cup 2024)లో ఆమె పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇక సూర్య విషయానికొస్తే ఈమధ్యే భారత టీ20 పగ్గాలు అందుకున్న అతడు శ్రీలంక సిరీస్‌లో ట్రోఫీ అందించాడు. టెస్టులపై కన్నేసిన సూర్య దులీప్ ట్రోఫీలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.