Amy Jackson | బాలీవుడ్ నటి అమీ జాక్సన్ (Amy Jackson) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబో 2.O చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చియాన్ విక్రమ్ ‘ఐ’మూవీలోనూ మెరిసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగు సినిమాలకు దూరమైంది. తాజాగా బ్యూటీ ప్రియుడిని పెళ్లాడింది. వీరి పెళ్లి ఇటలో జరిగింది. ఈ ఏడాది జనవరిలో హాలీవుడ్ నటుడు ఎడ్ విస్ట్విక్ (Ed Westwick) ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. గత కొద్దినెలలుగా ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు అమీ జాక్స్ షేర్ చేస్తూ.. ‘ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇదిలా ఉండగా.. అమీ జాక్సన్‌కు ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. గతంలో జార్జ్ పనయోట్టు అనే బిజినెస్‌మెన్‌తో ప్రయాణం నడిపి.. 2019లో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఆ తర్వాత పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనించింది. వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలువలేదు. చివరకు 2022లో పనయోట్టుతో తనబంధం ముగిసిందని ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత అమీ జాక్సన్ హాలీవుడ్ స్టార్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఇదిలా ఉండగా.. అమీ జాక్సన్ సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్‌గా రాణించింది. 2010లో తమిళంలో ‘మద్రాస్పట్టణం’ మూవీతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో ప్రతీక్ బబ్బర్ సరసన ‘ఏక్ దీవానా థా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2014లో తెలుగులో ‘ఎవడూ’ మూవీలో నటించింది. 2018లో రజనీకాంత్ 2.0లో సైతం కనిపించింది. మోడల్ నుంచి నటిగా మారిన అమీ జాక్సన్ అనేక తెలుగు బూగీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చివరగా బాలీవుడ్లో క్రాక్ మూవీలో నటించింది.