UPS : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్‌లో యూ అంటే మోదీ సర్కార్ యూటర్న్లని ఖర్గే అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం మోదీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మళ్లీ వెనక్కితీసుకోవడం వెనుక విపక్షాల విమర్శల దాడి ఉందని పేర్కొన్నారు.
జూన్ 4 తర్వాత ప్రజల శక్తి ప్రధాని అహంకారంపై విజయం సాధించిందని చెప్పారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌పై వెనక్కితగ్గడం, వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపడం, బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు ముసాయిదా ఉపసంహరణ, అధికార యంత్రాంగంలో లేటరల్ ఎంట్రీ రద్దు వంటి ఎన్నో నిర్ణయాలను మోదీ ప్రభుత్వం ఇటీవల వెనక్కితీసుకుందని ఖర్గే గుర్తుచేశారు. ఈ నియంతృత్వ ప్రభుత్వం నుంచి తాము 140 కోట్ల మందిని కాపాడుతున్నామని, ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చామని వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌కు భరోసా ఇచ్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కు కేంద్ర క్యాబినెట్ శనివారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. యుపిఎస్‌ని ఎంచుకునే ఉద్యోగులు 25 సంవత్సరాల కనీస సర్వీసుతో సూపర్‌యాన్యుయేషన్‌కు ముందు గత 12 నెలల్లో డ్రా చేసిన సగటు ప్రాథమిక వేతనంలో 50 శాతం హామీ ఇవ్వబడిన పెన్షన్ పొందేందుకు అర్హులు.
Read More :
Former IAS Sharma | యజమానులను జైలుకు ఎందుకు పంపడం లేదు.. చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ అధికారి లేఖ