Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్(Manu Bhaker) చరిత్ర సృష్టించింది. విశ్వ వేదికపై తొలి పతకం అందించి యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ ఫైనల్లో బాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కొల్లగొట్టింది.
దాంతో, షూటింగ్ విభాగంలో తొలి మెడల్ గెలుపొందిన మొదటి మహిళా షూటర్‌గా బాకర్ రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్ ప్రారంభమైన మూడో రోజు ఎట్టకేలకు భారత్ విశ్వ క్రీడల్లో పతకాల ఖాతా తెరిచింది.
ITS A BRONZE!!! Our first medal at @paris2024 comes in shooting courtesy of @realmanubhaker Fantastic shooting all along to bring home our first medal 🥉👏🏽👏🏽#JeetKiAur #Cheer4Bharat pic.twitter.com/hzTuN9G0I3
— Team India (@WeAreTeamIndia) July 28, 2024
క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో 580-27x స్కోరుతో అదరగొట్టిన భాకర్ మూడో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. అనుకున్నట్టుగానే కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షను నిజం చేసింది. ఫైనల్లోనూ చెక్కు చెదరని గురితో 221.7 పాయింట్లు సాధించింది. దాంతో, ఒలింపిక్స్‌లో తొలి మెడల్ గెలిచిన మహిళా షూటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా(Abhinav Bindra) స్వర్ణంతో మెరిసిన విసయం తెలిసిందే.