ఢిల్లీ: భారత ఫుట్బాల్ కోచ్ మనొలొ మార్కేజ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నిరుడు జాతీయ జట్టుకు కోచ్గా నియమితుడైన మనొలొ హయాంలో భారత జట్టు ఏడాదికాలంలో 8 మ్యాచ్లు ఆడి ఒకే ఒకదాంట్లో గెలిచింది. జట్టు పేలవ ప్రదర్శనతో అతడిని తప్పించాలని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మనొలొ.. తన కాంట్రాక్టు మరో ఏడాది ఉన్నా ముందుగానే వైదొలిగాడు.