కోల్కతా: టీమ్ఇండియా చీఫ్ కోచ్ గంభీర్ లక్ష్యంగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత ఓటమికి ప్రధాన కారణం గంభీర్ అని పేర్కొన్నాడు. ఓ వార్తాసంస్థతో తివారీ మాట్లాడుతూ ‘పెర్త్ టెస్టులో రానాను ఎందుకు ఎంపిక చేశారు.
ఢిల్లీకి ఆడుతున్న సమయంలో గంభీర్ నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకంటూ బూతులు తిట్టాడు. గంగూలీపై కూడా నోరుపారేసుకున్నాడు. గంభీర్ తిట్టిన ప్రతీసారి అతన్ని వెనకేసుకొచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారు’ అని అన్నాడు.