హైదరాబాద్, జూలై 4: కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డబ్ల్యూపీసీ ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నాడు. 197.5 కిలోల డెడ్‌లిఫ్ట్‌తో మనోజ్ సత్తాచాటాడు.
మనోజ్ స్వర్ణం నెగ్గడంతో హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఎన్ఐఎన్ కాలనీలో నివాసముంటున్న అతడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.