గ్రేటర్ నోయిడా: మహిళల జాతీయ బాక్సింగ్ టోర్నీలో మనీశా మౌన్, జాస్మిన్ లంబోరియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల 60కిలోల క్వార్టర్స్‌లో జాస్మిన్.. పూనమ్ కైత్వాస్(మహారాష్ట్ర)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన జాస్మిన్ పవర్ఫుల్ పంచ్‌లతో చెలరేగింది. సెమీస్‌లో పీఎస్ గిరిజాతో పూనమ్ తలపడనుంది.
మరో క్వార్టర్స్‌లో మనీశ 5-0తో టీసీ లాల్రెముర్తిని చిత్తుచేసింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ మనీశ..చెలరేగడంతో ప్రత్యర్థి నుంచి సమాధానం లేకపోయింది. 66కిలోల విభాగంలో అరుంధతి చౌదరీ 5-0తో కోమల్‌ప్రీత్ కౌర్‌పై విజయం సాధించి ముందంజ వేసింది.