లిమా (పెరు) : భారత యువ జుడోకా లింథోయ్ చానంబమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లిమాలో జరుగుతున్న జూడో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలిచి ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరఫున పతకం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
19 ఏండ్ల ఈ మణిపూర్ అమ్మాయి.. రెపిచేజ్ ద్వారా కాంస్య పోరుకు అర్హత సాధించింది. మహిళల 63 కిలోల కాంస్య పోరులో ఆమె నెదర్లాండ్స్‌కు చెందిన జోనీ గిలెన్‌ను ఓడించి పతకం గెలుచుకుంది.