టీటీ క్వార్టర్స్‌కు భారత జోడీలు

హ్యూస్టన్: భారత ప్యాడ్లర్లు మనికా బాత్రా- అర్చనా కామత్, మనిక-సాతియాన్ ప్రపంచ టేబుల్ టెన్నిస్(టీటీ) చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా- అర్చనా కామత్ ద్వయం 3-1 (11-4, 11-9, 6-11, 11-7)తో డొర మదరాస్జ్- గార్జిన పొట (హంగేరి) జోడీని ఓడించింది. రెండు గేమ్‌ల్లో దూకుడు ప్రదర్శించిన ఈ జోడీ మూడో గేమ్‌లో వెనకబడ్డారు. ఆఖరి గేమ్‌లో పోరాడి విజయం సాధించారు. క్వార్టర్స్‌లో సారా డె నట్టె- క్సియాలియాన్(లక్సెంబర్గ్) జంటతో మనిక-అర్చన జోడీ తలపడనుంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మనిక-సాతియాన్ ద్వయం 3-2 (15-17, 10-12, 12-10, 11-6, 11-7)తో కనక్ జా-వాంగ్ మన్యు (అమెరికా-చైనా) ద్వయంపై చెమటోడ్చి విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

