హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేదలపై సాగిస్తున్న దుర్మార్గానికి హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. రంగనాథ్‌ను వెంటనే తొలగించాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించే అధికారులను ప్రభుత్వం వెనుకేసుకురావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు. హైడ్రా పేరిట సాగించిన అక్రమాలపై న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వానికి సూచించారు.