Smriti Mandhana : భారత క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి అనుకోకుండా వాయిదా పడింది. హల్దీ, మెహందీతో పాటు సంగీత్ వేడుకలు పూర్తైన తర్వాత ఆమె తండ్రి శ్రీనివాస్ (Sreenivas) అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో.. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రికి అస్వస్థత కారణంగా మంధాన – పలాశ్ ముచ్చల్ తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా (Tuhin Mishra)వెల్లడించారు.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు మంధాన, పలాశ్ ముచ్చల్. తమ సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువులోని హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సంబురంగా జరిగాయి. భారత క్రికెటర్లు పలువురు మంధానతో కలిసి హుషారుగా పెళ్లి పనుల్లో పాల్గొన్నారు.
Smriti Mandhana and Palash Muchhal’ wedding postponed after her father falls ill, rushed to hospital. Tuhin Mishra, manager of Indian cricketer Smriti Mandhana, confirms that her father is not well and the wedding has been indefinitely postponed.
Read here:… pic.twitter.com/kg79QmNDHE
— DNA (@dna) November 23, 2025
ఇక వివాహమే తరువాయి అనుకున్న వేళ.. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారు. దాంతో.. ఆయనను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ఈ హఠాత్పరిణామంతో అప్పటిదాకా సంబురాల్లో మునిగిపోయిన ఇరుకుటుంబాలు, బంధుపరివారం ఉలిక్కిపడింది. తండ్రి దవాఖానలో చికిత్స పొందుతున్నందున ఆయన కోలుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని మంధాన, పలాశ్లు నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఈరోజు (నవంబర్ 23న) జరగాల్సిన వారి వివాహం అర్దాంతరంగా వాయిదా పడింది.
VIDEO | Tuhin Mishra, manager of Indian cricketer Smriti Mandhana, confirms that her father is not well and the wedding has been indefinitely postponed.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/K5EVJwyR4h
— Press Trust of India (@PTI_News) November 23, 2025
‘ఈరోజు ఉదయం నుంచి మంధాన తండ్రి ఆరోగ్యం సరిగా లేదు. దాంతో.. ఆయనను సంగ్లీలోని ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అన్నిరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇవ్వనున్నారు. తండ్రి ఆస్పత్రిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దని మంధాన నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని పలాశ్ కుటుంబంతో చెప్పగా.. అందరూ వివాహం వాయిదా వేసేందుకు అంగీకరించారు’ అని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించాడు.