Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) రికార్డుల మోత మోగిస్తోంది. మూడు ఫార్మాట్లలో కలిపి మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన లార్డ్స్ టెస్టులో అర్ధ శతకంతో చెలరేగింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బౌలర్లను ఉతికేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడింది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన లార్డ్స్ మైదానంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి మహిళల టెస్టులో తొలి ఫిఫ్టీ మంధాన నమోదు చేయడం విశేషం.
భారత ఓపెనింగ్ భారాన్ని మోస్తున్న స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు నెలకొల్పింది. లార్డ్స్‌లో ఏకైక టెస్టుతో అంతర్జాతీయంగా మూడొందల మ్యాచ్‌ల క్లబ్లో చేరిందీ డాషింగ్ బ్యాటర్. చిన్న వయసులోనే మూడొందల మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా ఇండియా స్టార్ చరిత్రకెక్కింది.
3️⃣0️⃣0️⃣ international matches of class & elegance 💙
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana on a special & monumental milestone 👏#ENGvIND pic.twitter.com/r9HnNZZYe0
— BCCI Women (@BCCIWomen) July 10, 2026
జూలై 10 శుక్రవారం నాటికి మంధానకు 29 ఏళ్ల357 రోజులు కాగా.. దక్షిణాఫ్రికా ప్లేయర్ సునే లుస్(30 ఏళ్ల 163 రోజులు), ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ(33 ఏళ్ల 65 రోజులు)లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా విషయానికొస్తే.. మంధాన కంటే ముందు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ప్రస్తుత నాయకీ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్లో మూడొందల మ్యాచ్‌లతో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ మంధాన మూడు ఫార్మాట్లలో కలిపి.. 9 టెస్టులు, 171 టీ20లు, 120 వన్డేలు ఆడింది.
First Test FIFTY in women’s cricket at Lord’s 🏟️
And it’s none other than #TeamIndia vice-captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/Z2oaM5vqsz
— BCCI Women (@BCCIWomen) July 10, 2026