Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన (56 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగింది. అంతర్జాతీయంగా మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన.. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టీమిండియా స్కోర్ బోర్డును ఉరికించింది. 37 పరుగులకే రెండు వికెట్లు పడిన వేళ.. జెమీమా రోడ్రిగ్స్(35), అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(14 నాటౌట్)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిందీ వైస్ కెప్టెన్. దాంతో తొలి సెషన్లో ఆతిథ్య జట్టు ఉత్సాహంపై నీళ్లు చల్లిన మంధాన, హర్మన్‌ప్రీత్ జట్టును గట్టెక్కించే పనిలో ఉన్నురు.
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు తొలి సెషన్లో ధీటుగా ఆడింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌటవ్వగా.. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన యస్తికా భాటియా(12) సైతం నిరాశపరిచింది. దాంతో, 37 పరుగులకే రెండు కీలక వికెట్లు పడినా ఓపెనర్ స్మృతి మంధాన(56 నాటౌట్) ఒత్తిడకి లోనవ్వకుండా పట్టుదలగా ఆడింది.
Lunch on Day 1️⃣
A fine fifty from Smriti Mandhana highlights #TeamIndia‘s first session 👏
Updates ▶️ https://t.co/O1rEau7LiP#ENGvIND pic.twitter.com/N3vV8EN74c
— BCCI Women (@BCCIWomen) July 10, 2026
జెమీమా రోడ్రిగ్స్(35)తో కలిసి ఆతిథ్య జట్టు బౌలర్లను కాచుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ యాభైకి పైగా రన్స్ జోడించింది. ఇసీ వాంగ్ ఓవర్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని జెమీమా బౌల్డైంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(14 నాటౌట్)తో కలిసి స్కోర్ 120 దాటింది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న మంధానతో పాటు హర్మన్‌ప్రీత్ క్రీజులో నిలవడంతో భోజన విరామానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.
First Test FIFTY in women’s cricket at Lord’s 🏟️
And it’s none other than #TeamIndia vice-captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/Z2oaM5vqsz
— BCCI Women (@BCCIWomen) July 10, 2026