DIW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు చూపిస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు.. నవీ ముంబైలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. భారీ ఛేదనలో కెప్టెన్ స్మృతి మంధాన(96) విధ్వంసక అర్ధ శతకంతో విరుచుకు పడింది. జార్జియా వోల్(54 నాటౌట్)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. విజయానికి 11 పరుగులు అవసరమనగా మంధాన ఔటైంది. ఆ తర్వాత రీచా ఘోష్(7 నాటౌట్) లాంఛనం పూర్తి చేసింది.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో మాజీ ఛాంపియన్ ఆర్సీబీ అజేయంగా దూసుకెళ్తోంది. శనివారం జరిగిన రెండో డబుల్ హెడర్‌లో ఛాలెంజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లింది ఆర్సీబీ. 167 పరుగలు ఛేదనలో స్మృతి మంధాన(96) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. జార్జియా వోల్(54 నాటౌట్) సైతం దంచేసింది. వీరిద్దరూ సెంచరీ భాగస్వా్మ్యంతో బెంగళూరు విజయాన్ని నల్లేరుపై నడక అన్నట్టుగా మార్చేశారు.
Just FOUR runs short! ☹️
A remarkable knock from #RCB Captain Smriti Mandhana comes to an end
Updates ▶️ https://t.co/NnuH8NbLG5#TATAWPL | #KhelEmotionKa | #DCvRCB pic.twitter.com/JR22vHrdRQ
— Women’s Premier League (WPL) (@wplt20) January 17, 2026
టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే బిగ్ షాకిచ్చింది లారెన్ బెల్(3-26). తొలి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ లిజినే లీ(4)ని ఔట్ చేసిన తను.. ఆ తర్వాతి బంతికే లారా వొల్వార్డ్త్(0)ను క్లీన్‌బౌల్డ్ చేసింది. రెండో ఓవర్లో సయాలీ సత్ఘరే(2-4) తన పేస్ మ్యాజిక్‌తో వరుస బంతుల్లో జెమీమా రోడ్రిగ్స్(4), మరినే కాప్(0)లను బౌల్డ చేసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టింది. తొమ్మిది బంతుల్లో.. 10కే ఆ జట్టు నాలుగు వికెట్లు పడ్డాయి.
Shafali storm in Navi Mumbai 🌪️
Can she guide #DC to a strong finish? 🤔
Updates ▶️ https://t.co/NnuH8NcjvD #TATAWPL | #KhelEmotionKa | #DCvRCB pic.twitter.com/Gb3oLTq9zQ
— Women’s Premier League (WPL) (@wplt20) January 17, 2026
వందలోపే కుప్పకూలేలా కనిపించిన ఢిల్లీని ఓపెనర్ షఫాలీ వర్మ(62) విధ్వంస అర్ధ శతకంతో ఆదుకుంది. స్నేహ్ రానా(22) తోడుగా ఇన్నింగ్స్ నిర్మించిన షఫాలీ.. ఆఖర్లో్ హమిల్టన్(36) జతగా స్కోర్ బోర్డును ఉరికించింది. శ్రేయాంక వేసిన 19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదడంతో ఢిల్లీ స్కోర్ 160 దాటింది. వీరిద్దరి మెరుపులతో ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఢిల్లీ.