INDU19 vs ZIMU19 : అండర్ -19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సూపర్ సిక్స్‌లోనూ భారీ స్కోర్ కొట్టింది. బులవాయలో జింబాబ్వే బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(52) హడలెత్తించగా.. విహాన్ మల్హోత్రా(109) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అభిగ్యాన్ కుందు(61) జతగా బౌండరీలతో రెచ్చిపోయిన విహాన్ చివరిదాకా క్రీజునంటుకొని స్కోర్ 350 దాటించాడు. వీరిద్దరి మెరుపులతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.
టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన జింబాబ్వే పెద్ద పొరపాటే చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(52) తన మార్క్ విధ్వంసంతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ మెరుపు అర్ధ శతకతో శుభారంభవిచ్చాడు. అరోన్ జార్జ్(23), కెప్టెన్ ఆయుష్ మాత్రే(21)లు విఫలమైనా దూకుడైన ఆటతో పవర్ ప్లేలో స్కోర్ వంద దాటించాడు.
Innings Break!
Vihaan Malhotra’s brilliant century leads India U19’s charge against Zimbabwe U19 in the Super Six clash 💯👊
Over to our bowlers as we defend 3⃣5⃣2⃣ runs 🎯
Scorecard ▶️https://t.co/juFENSDomr #U19WorldCup pic.twitter.com/f4YB9ulNkB
— BCCI (@BCCI) January 27, 2026
నాలుగేసి సిక్సర్లు, ఫోర్లతో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్‌ను చిముగొరే బోల్తా కొట్టించాడు. వైభవ్ ఔటయ్యాక.. విహాన్ మల్హోత్రా(109 నాటౌట్), అభిగ్యాన్ కుందు(61)లు క్రీజులో పాతుకుపోయారు. వీరిద్దరూ ఆడుతూ పాడుతూ స్కోర్‌బోర్డును ఉరికించారు.
𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 💯
Vihaan Malhotra rises to the occasion with a well-structured knock 👏 👏
Scorecard ▶️https://t.co/juFENSDomr #U19WorldCup pic.twitter.com/sL1ozP7asg
— BCCI (@BCCI) January 27, 2026
ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు పునాది వేసిన అభిగ్యాన్ను మడ్జెన్గెరెరీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత టెయిలెడర్లు అంబ్రిష్(21), హెనిల్ పటేల్(30)లతో కలిసి జట్టు స్కోర్ 300 దాటించిన విహాన్.. 49వ ఓవర్లో బౌండరీలో సెంచరీ సాధించాడు. దాంతో.. ప్రత్యర్ధికి 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆయుష్ మాత్రే సేన.