Siraj-Mahira | భారత్‌లో క్రికెట్‌కు, సినిమా ఇండస్ట్రీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పలువురు నటీమణులు క్రికెటర్లతో కలిసి డేటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సెటిల్ అయిన వారున్నారు. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు, హీరోయిన్లు ఎక్కడ కలిసి కనిపించినా వారి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో ఓ నటి డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో రిలేషన్ వార్తలు రాగా.. తనకు సోదరిలాంటిదని సిరాజ్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా బిగ్‌బాస్-13 ఫేమ్ మహిరా శర్మతో డేటింగ్లో ఉన్నారని.. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.
సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు ఫాలో అవుతుండడంతో పాటు ఫొటోలను లైక్ చేయడంతో పాటు కామెంట్స్ చేశారు. దాంతో వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ జరుగుతుందంటూ రూమర్స్ మొదలయ్యాయి. హైదరాబాదీ బౌలర్ టీమిండియా జాతీయ జట్టుతో రాణిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయం తెలిసిందే. మహిరా శర్మ హిందీ, పంజాబీ టెలివిజన్ షోలో నటించింది. జమ్మూ నుంచి ఇండస్ట్రీకి వచ్చింది. 2017లో యారోన్ కా తషాన్ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగిన్, బెపనా ప్యార్, కుండలి భాగ్య తదితర సీరియల్స్‌లో కనిపించింది. 2023లో లెహంబర్ గిన్ని సినిమాలో నటించింది. బిగ్‌బాస్-13 సీజన్లో పాల్గొని పాపులారిటీ సాధించింది. సిరాజ్-మహిరా డేటింగ్ వార్తలపై ఆమె తల్లి సానియా శర్మ స్పందించింది. ఈ విషయంలో విలేకరులు ప్రశ్నించగా.. అసలు మీరేం మాట్లాడుతున్నారు.. బయటి వ్యక్తులు ఏవో చెబుతుంటారని మండిపడింది. తన కూతురు ఓ సెలబ్రిటీ అని.. అభిమానులు ఆమెకు ఎవరితోనో సంబంధాలు అంటగడుతుంటారని.. వాటిని నమ్ముతారా? అవన్నీ అవాస్తవంటూ డేటింగ్ వార్తలను కొట్టిపడేశారు.