అహ్మదాబాద్: ఆన్ఫీల్డ్తో పాటు ఆఫ్‌ఫీల్డ్‌లోనూ సీరియస్‌గా కనిపించే టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కురిపించాడు. గంభీర్‌ను ‘కోచ్ సాహెబ్’ అని సంభోదిస్తూ..‘మీ మోముపై చిరునవ్వు చాలా బాగుంటుంది’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. సుమారు రెండేండ్ల విరామం తర్వాత ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘అహ్మదాబాద్‌లో సరికొత్త చరిత్ర! టీమ్ఇండియాకు, సహాయక సిబ్బందికి, ప్రపంచవ్యాప్తంగా భారత జట్టును అభిమానించే ఫ్యాన్స్‌కు కృతజతలు. కోచ్ సాహెబ్, మీ మోముపై చిరునవ్వు చాలా గొప్పగా ఉంటుంది.
విజయం సాధించాలనే పట్టుదలకు నవ్వు తోడైతే అదొక కిల్లర్ కాంబినేషన్. జట్టును చాలా బాగా నడిపించారు. బుమ్రా గురించి చెప్పాలంటే అతడొక చాంపియన్ బౌలర్’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు గంభీర్ స్పందిస్తూ.. ‘నవ్వడానికి ఎంత మంచి సందర్భం! మిమ్మల్ని గ్రౌండ్లో చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని కామెంట్ చేయడం గమనార్హం.