కొలంబో: శ్రీలంక లెగ్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ(Maheesh Theekshana).. ఆసియాకప్ ఫైనల్‌కు దూరం అయ్యాడు. తొడకండరాల గాయం వల్ల అతన్ని ఆ మ్యాచ్‌కు దూరం ఉంచారు. ఆదివారం భారత్‌తో ఆసియాకప్ ఫైనల్ జరగనున్న విషయం తెలసిందే. పాకిస్థాన్‌తో సూపర్ ఫోర్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్ సమయంలో.. తీక్షణకు గాయమైనట్లు ఏషియన్ క్రికెట్ మండలి పేర్కొన్నది. తీక్షణకు స్కానింగ్ చేశామని, అతని కండరాలకు గాయమైనట్లు తేలిందన్నారు. తీక్షణ స్థానంలో సహన్ అరచిగేను తీసుకున్నారు. ఆసియాకప్‌లో అయిదు మ్యాచుల్లో తీక్షణ 8 వికెట్లు తీసుకున్నాడు. 29.12 సగటుతో అతను వికెట్లు పడగొట్టాడు. అరచిగే ఇప్పటి వరకు శ్రీలంకకు ఒక మ్యాచ్ ఆడాడు. దాంట్లో 57 రన్స్ చేసి ఓ వికెట్ తీసుకున్నాడు.