జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో మహారాష్ట్ర ఐరన్‌మ్యాన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో మహారాష్ట్ర 38-24తేడాతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించింది.
మహారాష్ట్ర జట్టుకు చెందిన ఇగోర్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కించుకోగా.. లీగ్‌లో 102 గోల్స్ చేసిన యూపీ ప్లేయర్ సుఖ్వీర్ సింగ్ ‘గోల్డెన్ బాల్’ అవార్డు అందుకున్నాడు.