World Cup Stars : మహిళల వరల్డ్ కప్ ఛాంపియన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు నీరాజనాలు పలుకుతున్నాయి. అద్భుత ప్రదర్శనతో యావత్ దేశం గర్వించేలా చేసిన భారత స్టార్లకు ఘన స్వాగతం లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి స్వరాష్ట్రం చేరుకుంటున్న క్రికెటర్లకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన (Smriti Mandhana), జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues), రాధా యాదవ్ (Radha Yadav)లను శుక్రవారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సత్కరించారు. తన నివాసం వర్షా బంగళాలో ఆయన ఈ ముగ్గురిని నగదు బహుమతితో అభినందించారు.
భారత మహిళల జట్టు దశాబ్దాల కల సాకారమవ్వడంలో కీలకంగా వ్యవహరించిన మంధాన, జెమీమా, రాధాలను సీఎం ఫడ్నవీస్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ అద్భుత ఆటతో వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించిన ఈ ముగ్గురికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువాలు కప్పి సత్కరించారు. అంతేకాదు తలా రూ.2.5కోట్ల చెక్కును ప్రదాన చేశారు సీఎం. కోచ్ అన్మోల్ మజుందార్‌కు రూ.2.5లక్షల చెక్కున ముఖ్యమంత్రి అందజేశారు.
VIDEO | Mumbai: Maharashtra CM Devendra Fadnavis and Deputy CM Ajit Pawar felicitate World Cup champions Smriti Mandhana, Jemimah Rodrigues, and Radha Yadav.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/BGrBvYcazZ
— Press Trust of India (@PTI_News) November 7, 2025
టీమిండియా చరిత్ర సృష్టించడంలో భాగమైన బౌలింగ్ కోచ్ ఆవిష్కర్ సాల్వీ, సహాయక సిబ్బంది, సెలెక్టర్లు డయాని ఎడుల్జీ, విశ్లేషకుడు అనిరుద్ధ దేశ్‌పాండేలను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, క్రీడా శాఖ మంత్రి మాణిక్‌రావు కొకటే, సాంస్కృతిక శాఖామాత్యులు అశిష్ షెలార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ఖండరే, తదితరులు పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి జెమీమా కుటుంబ సమేతంగా హాజరైంది.
#WATCH | Mumbai: After meeting Maharashtra CM Devendra Fadnavis, Cricketer Jemimah Rodrigues who was a part of World Cup-winning Women’s Cricket Team, says, “…I think this win for us is going to do massive things for India. It was just the boost we needed. The pay parity coming… pic.twitter.com/NSwitzqITm
— ANI (@ANI) November 7, 2025
వరల్డ్ కప్ విజయంతో భారత్‌లో మహిళల క్రికెట్ మరింత అభివృద్ది చెందుతుందని చెప్పింది జెమీమా. తమను సన్మానించి, నగదు ప్రోత్సాహం అందించిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. 2011లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వరల్డ్ కప్ విజేతగా బాంద్రాకు వచ్చిన రోజులను తను గుర్తు చేసుకుంది. ‘వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందిన తర్వాత బాంద్రాలోని సచిన్ ఇల్లు సందర్శకులతో కిటకిటలాడింది. మా ఇల్లు పక్కనే కావడంతో బాల్కనీ నుంచి సచిన్‌ను చూశాను. ఆయన కారు కూడా కదలేనంతగా జనం పోగయ్యారు. అప్పుడు నాకు 11 ఏళ్లు. ఆ సమయంలోనే నేను వరల్డ్ కప్ ఛాంపియన్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని జెమీమా వెల్లడించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో అజేయం శతకం(127 నాటౌట్)తో జట్టుకు విజయాన్ని అందించింది జెమీమా.