T20 World Cup : పొట్టి ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత్, శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాడు. పదో సీజన్లో ట్రోఫీపై కన్నేసిన ఇరుజట్లు అనూహ్యంగా కీలక పేసర్లను కోల్పో యాయి. లీగ్ దశలో తొలి మ్యాచ్‌కు ముందే పేస్ సంచలనాలు టోర్నీ నుంచి నిష్క్రమించారు. టీమిండియా ఆల్‌రౌండర్ హర్షిత్ రానా (Harshit Rana) మోకాలి గాయంతో వైదొలగగా.. కో -హోస్ట్ లంకకు ఇషాన్ మలింగ (Eshan Malinga) దూరమయ్యాడు. దాంతో, హర్షిత్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న భారత్. మలింగను ఆయుధంగా ప్రయోగించాలనుకున్న లంకకు పెద్ద షాక్ తగిలింది.
స్వదేశం పొట్టి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో పటిష్టమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగిన భారత్, శ్రీలంకకు తొలి మ్యాచ్‌కు ముందే బిగ్ షాక్. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత పేస్ సంచలనం హర్షిత్ రానా మెగా టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ అనంతరం గాయపడిన రానా.. కోలుకోకపోవడంతో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. తాజాగా శ్రీలంక సైతం యార్కర్ స్పెషలిస్ట్ ఇషాన్ మలింగ సేవల్ని కోల్పోయింది. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఎడమ భుజం ఎముక స్థానభ్రంశం చెందడంతో మైదానం వీడిన ఇషాన్ కోలుకోలేదు. దాంతో.. అతడి స్థానంలో ప్రమోద్ మధుషాన్ స్క్వాడ్‌లోకి వచ్చాడు.
Madushan approved as replacement for Malinga https://t.co/podhuwp7kz
— ICC Media (@ICCMediaComms) February 6, 2026
ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడిన అతడిని వరల్డ్‌కప్‌కోసం తీసుకోలేదు. కానీ, అనూహ్యంగా ఇషాన్ మలింగ గాయపడడంతో మధుషాన్కు అవకాశం లభించింది. ఎనిమిది టీ20ల అనుభమే ఉన్న మధుషాన్ ..12 వికెట్లు పడగొట్టాడు. మెగా ఈవెంట్లో పథిరన, చమీరతో కలిసి అతడు పేస్ దళంలో కీలకం కానున్నాడు. తొలి మ్యాచ్‌లో లంక ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది.
శ్రీలంక టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : దసున్ శనక(కెప్టెన్), పథుమ్ నిశాంక, కమిల్ మిశార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత అసలంక, జనిత్ లియానగే, పవన్ రత్ననాయకే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ్ థీక్షణ, దుశ్మంత చమీర, మథీశ పథిరన, ప్రమోద్ మధుషాన్.
భారత టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇసాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్. వరుణ్ చక్రవర్తి. సిరాజ్.