లక్నో: లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, దిగ్వేశ్ రాఠిపై జరిమానా పడింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా స్లోఓవర్రేట్కు పాల్పడినందుకు గాను కెప్టెన్ పంత్‌కు 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. నిర్దేశిత సమయానికి మించి మ్యాచ్ కొనసాగడాన్ని కారణంగా పేర్కొన్న నిర్వాహకులు ఐపీఎల్ నియమ నిబంధనలు ఆర్టికల్ 2.22ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మరోవైపు మిస్టరీ స్పిన్నర్‌గా మన్ననలు అందుకుంటున్న దిగ్వేశ్ మరోమారు ‘నోట్‌బుక్ సెలెబ్రేషన్’ చేసినందుకు మ్యాచ్ ఫీజులో 50శాతంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కోత విధించారు. ఆర్టికల్ 2.5 ప్రకారం లెవల్-1 తప్పిదం కింద జరిమానా వేసినట్లు లీగ్ వర్గాలు పేర్కొన్నాయి.