IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి (35), అబ్దుల్ సమద్(21), వాషింగ్టన్ సుందర్(16) మాత్రమే రాణించారు. ఉనాద్కాట్ వేసిన ఆఖరి ఓవర్లో సమద్ రెండు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, హైదరాబాద్ 120 ప్లస్ స్కోర్ చేయగలిగింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. అమిత్ మిశ్రాకు రెండు, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్లకు తలా ఒక వికెట్ దక్కింది.
Innings Break!
Disciplined bowling by the #LSG bowlers restrict #SRH to a total of 121/8 on the board.
Scorecard – https://t.co/7Mh0bHCrTi #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/YDwKABg2hu
— IndianPremierLeague (@IPL) April 7, 2023