Tu Yaa Main | బాలీవుడ్ దర్శకుడు బీజోయ్ నంబియార్ చాలా రోజుల తర్వాత మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘తు యా మైన్’ (Tu Yaa Main). ఈ చిత్రంలో ఆదర్శ్ గౌరవ్, సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ టీజర్ చూస్తుంటే.. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ‘లైక్స్’, ‘సబ్స్క్రైబ్స్’ కోసం పోటీ పడుతున్న ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కథగా ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరూ స్విమ్మింగ్ ఫూల్లో ఉండగా.. అనుకోకుండా వీరిపై మొసలి (Crocodile) దాడి చేస్తుంది. ఈ దాడి నుంచి వీరిద్దరూ ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథ. ఈ సినిమాను ఆనంద్ ఎల్. రాయ్, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.