IPL 2025 : డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఢీ కొంటున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రిషభ్ పంత్(Rishabh Pant) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పోరాడి ఓడిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ లేకుండానే బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా సంజూ దూరం కావడంతో రియాన్ పరాగ్ జట్టును నడిపించనున్నాడు.
ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన లక్నో ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. తమ కూర్పులో ఒక మార్పు చేసింది. పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ ఎడిషన్‌లో రెండంటే రెండే విజయాలతో 7వ స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు ఇది చావోరేవో గేమ్. ఈ మ్యాచ్‌తో 14ఏళ్ల యువకెరటం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు.