Los Angeles Olympics 2028 : విశ్వ క్రీడల్లో క్రికెట్ పునరాగమనానికి ఇంకా నాలుగేండ్లు ఉంది. దాదాపు 36 ఏండ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఫీవర్‌తో అభిమానులను ఊగిపోనున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles) వేదికగా 2028లో జరుగబోయే పోటీల్లో క్రికెట్ నిర్వహణకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే.. ఏ మైదానంలో మ్యాచ్‌లు ఆడిస్తారు? అనేది గందరగోళంగా మారింది. ప్రధాన వేదికైన క్యాలీఫోర్నియా పశ్చిమ తీరంలో ఉంది. అందుని తూర్పు తీరంలో ఉన్న న్యూయార్క్‌లో క్రికెట్ మ్యాచ్‌లకు ఆదరణ ఎక్కువని, అక్కడే ఆడించాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు ఎక్కడ నిర్వహించాలి? అనే విషయమై చర్చిస్తున్నాం అని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ప్రధాన అధికారి క్యాసే వసెర్మన్ ఓ ప్రకటనలో తెలిపాడు. అంతేకాదు లాస్ ఏంజెల్స్‌కు, భారత కాలమానానికి దాదాపు 12 గంటల 30 నిమిషాల తేడా ఉంటుంది. ఇక్కడ రాత్రి 8 గంటలకు క్రికెట్ మ్యాచ్‌లు ఆడిస్తే.. భారత్‌లోని అభిమానులు ఉదయం 8 గంటలకు లైవ్ చూసే వీలుంది. అలాకాకుండా న్యూయార్క్‌లో సమయం అంతరం ఇండియాకు 9 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. అందుకని భారత అభిమానులు సౌకర్యంగా మ్యాచ్‌లు చూడొచ్చు.
Shudders at the thought of… Nassau County International Cricket Stadium. https://t.co/jimLewXqkM
— Saurabh Malhotra (@MalhotraSaurabh) October 22, 2024
ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తే.. ఇండియాలో రాత్రి 8 గంటలకు లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అందుకని న్యూయార్క్‌లోనే క్రికెట్ మ్యాచ్‌లు జరపాలని అమెరికా ఒలింపిక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ మ్యాచ్‌లు న్యూయార్క్‌లో ఎంత అధ్వాన్నంగా సాగాయో చూశాం. అందుకని ‘మళ్లీ అవే కృత్రిమ పిచ్‌ల మీద ఒలింపిక్ మ్యాచ్‌లా?’ అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు.
వరల్డ్ కప్‌లో ఆతిథ్య దేశం అమెరికాతో పాటు టీమిండియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్‌లు న్యూయార్క్‌లోని నస్సౌ క్రికెట్ స్టేడియంలో జరిగాయి. ఊహించని బౌన్స్‌తో కూడిన ఆ పిచ్ మీద బ్యాటర్లు తడబడగా.. బౌలర్లు పెట్రేగిపోయారు. అసలు టీ20 మజానే లేకుండా స్వల్ప స్కోర్లు నమోదు కావడంతో.. ‘ఇదేం పిచ్రా బాబూ’ అని క్రికెట్ విశ్లేషకులు అమెరికా క్రికెట్ బోర్డుపై మండిపడిన విషయం తెలిసిందే.
🚨 CRICKET IN LA OLYMPICS IN NEW YORK…!!!! 🚨
– New York is likely to host the Cricket in Los Angeles Olympics due to timing for fans in the subcontinent especially in India. (Cricbuzz). pic.twitter.com/28apZ4wQuJ
— Knight Club : KKR (@KnightClub_KKR) October 22, 2024