ముంబై: స్థానిక క్రికెట్ టోర్నీలో భాగంగా మ్యాచ్‌లో తనకు ప్రాతినిథ్యం కల్పించలేదనే కారణంగా ఓ వ్యక్తి క్రికెట్ పిచ్‌ను నాగళ్లతో దున్నించిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. జలగావ్లో నిర్వహించిన ‘రూరల్ ఎమ్మెల్యే కప్’ సందర్భంగా మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా అక్కడకు ఓ వ్యక్తి ట్రాక్టర్ వేసుకుని వచ్చాడు. కోపోద్రిక్తుడై ఉన్న అతడు.. ట్రాక్టర్‌తో మైదానాన్ని దున్నుకుంటూ పిచ్ ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అంపైర్లు, ప్లేయర్లు వద్దంటున్నా వినకుండా పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేశాడు. అయితే అతడిని మ్యాచ్‌కు ఆహ్వానించనందుకే సదరు వ్యక్తి ఈ పనిచేశాడని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వాళ్లు ఆడే ఆ మైదానానికి సంబంధించిన పొలం అతడిదే అయినట్టుంది. అతడిని మ్యాచ్ ఆడనీయనందుకే అలా చేశాడేమో’ అని కామెంట్స్ చేస్తున్నారు.