ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 15:03:21

టెస్టు చ‌రిత్ర‌లో అత్య‌ల్ప స్కోర్లు ఇవే..

టెస్టు చ‌రిత్ర‌లో అత్య‌ల్ప స్కోర్లు ఇవే..

హైద‌రాబాద్‌:  ఆస్ట్రేలియాతో జ‌రిగిన అడిలైడ్ టెస్టులో భార‌త్ ఘోరంగా ఓట‌మిపాలైంది.  టెస్టు చ‌రిత్ర‌లో భార‌త జ‌ట్టు అత్య‌ల్ప స్కోర్‌కు ఔటైంది. రెండవ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 36 ర‌న్స్‌కే కోహ్లీసేన తోక‌ముడిచింది.  ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అనూహ్య రీతిలో టెస్టును సొంతం చేసుకున్న‌ది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టు చ‌రిత్ర‌లో న‌మోదు అయిన అత్య‌ల్ప స్కోరు మాత్రం ఆస్ట్రేలియా ఖాతాలోనే ఉన్న‌ది. 1955లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవ‌లం 26 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 1896లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 30 ర‌న్స్‌కే ఓ ఇన్నింగ్స్‌ను ముగించింది.  1924లోనూ ఇంగ్లండ్ చేతిలోనే సౌతాఫ్రికా కేవ‌లం 30 ర‌న్స్ చేసింది. 1899లో ఓ సారి ఇంగ్లండ్ చేతిలో సౌతా‌ఫ్రికా 35 ర‌న్స్ చేసింది.1932లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిన సౌతాఫ్రికా ఓ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 36 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. 

1902లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవ‌లం 36 ర‌న్స్ చేసింది.  అయితే ఇవాళ జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో న‌మోదు అయిన అత్య‌ల్ప స్కోర్ ఆ జాబితాలో ఏడ‌వ స్థానంలో ఉన్న‌ది.  ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో రెండ‌వ ఇన్నింగ్స్‌లో భార‌త్ కేవ‌లం 36 ర‌న్స్‌కే ఆలౌటైంది. 2019లో ఇంగ్లండ్ చేతిలో ఐర్లాండ్ ఓ ఇన్నింగ్స్‌లో 38 ర‌న్స్‌కే చేతులెత్తేసింది. 1946లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ 42 ర‌న్స్‌కు ఆలౌటైంది. 1888లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓ ఇన్నింగ్స్‌లో 42కే నిష్క్ర‌మించింది.


logo