Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi)కి మరో అవార్డు గెలిచాడు. 2023లో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ఎనిమిదోసారి బాలిన్ డి ఓర్(Ballon d’Or) అవార్డు అందుకన్న మెస్సీ తాజాగా ‘బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ 2023’ అవార్డు ఎగరేసుకుపోయాడు. నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland)ను వెనక్కి నెట్టి ఈ అవార్డును అందుకున్నాడు.
హాలాండ్, మెస్సీలు ఇద్దరూ 48 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే.. ఫస్ట్ నామినేషన్‌గా ఎక్కువ ఓట్లు మెస్సీకి రావడంతో అతడినే విజేతగా ప్రకటించారు. ఫ్రాన్స్ యువకెరటం కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Messi is crowned #TheBest! 👑🇦🇷
Click here for more information. ➡️ https://t.co/niVRuFY4lP pic.twitter.com/krIyrtkexL
— FIFA World Cup (@FIFAWorldCup) January 15, 2024
నిరుడు ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన మెస్సీ.. తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపొందిన మెస్సీ సేన సగర్వంగా ట్రోఫీని అందుకుంది. అనంతరం అతడు పీఎస్జీ క్లబ్‌ను వీడి ఇంటర్ మియామి(Inter Miami)తో ఒప్పందం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఐతనా బొన్మతి(Aitana Bonmati) బెస్ట్ మహిళా ప్లేయర్ అవార్డుకు అందుకుంది.
వచ్చీ రాగానే మేజర్ సాకర్ లీగ్‌లో సంచలన ఆటతో మియామి క్లబ్‌ను విజేతగా నిలిపాడు. 2023లో అత్యుత్తమ ప్రదర్శనకు మెస్సీ.. ఎనిమిదోసారి బాలిన్ డి ఓర్ అవార్డు సాధించాడు. అంతేకాదు ప్రతిష్ఠాత్మక ‘పుబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డు కోసం భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పోటీ పడ్డాడు. అయితే.. చివరకు విరాట్ విజేతగా నిలిచాడు.
డిగో మారడోనా, మెస్సీ
అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించిన మెస్సీకి ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య అరుదైన గౌరవం కల్పించింది. లెజెండరీ ఆటగాడు డిగో మారడోనా(Diego Maradona)కు సైతం దక్కని గుర్తింపు ఈ ఫార్వర్డ్ ప్లేయర్‌కు దక్కింది. మెస్సీ ధరించే 10వ నంబర్ జెర్సీకి శాశ్వతంగా వీడ్కోలు పలకాలని అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం(AFA) నిర్ణయించింది.