Lionel Messi | మెస్సి సంచలన ప్రకటన.. ప్రపంచకప్‌లో ఇదే నా చివరి మ్యాచ్ అంటూ..!
Lionel Messi | ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫైనల్లోకి అర్జెంటీనా ప్రవేశించింది. క్రొయేషియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ సందర్భంగా మెస్సి సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రపంకచప్ ఫైనల్ మ్యాచే అర్జెంటీనా తరఫున తాను ఆడబోయే చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు.

మ్యాచ్ అనంతరం మెస్సి మాట్లాడుతూ… ‘అర్జెంటీనా ఫైనల్స్‌కు చేరడం సంతోషంగా ఉంది. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ అనంతరం నా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నా. మరో ప్రపంచకప్‌కు చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నేను ఇలాగే ఆడతానని అనుకోవడం లేదు. నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ఇలా ముగించడమే బెస్ట్ అని అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.
క్రొయేషియాతో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీపర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచనా వేసినా.. మెస్సీ పవర్ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది. నెట్లో కొంచెం ఎత్తులోకి ఆ బాల్ ఎగురుతూ వెళ్లింది. ఈ గోల్‌తో మెస్సీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు తన ఖాతాలో అయిదు గోల్స్ వేసుకున్నాడు. ఇక వరల్డ్‌కప్‌లలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సి నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్