బార్సిలోనా: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లు.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi )కి బార్సిలోనా క్లబ్‌తో ఉన్న అనుబంధం రెండు దశాబ్దాలది. అలాంటి బంధం తెగిపోతోంది. మెస్సీ క్లబ్‌ను వీడనున్నట్లు బార్సిలోనా స్పష్టం చేసింది. ఇప్పటికే మెస్సీ, క్లబ్ మధ్య ఓ ఒప్పందం కుదిరినా.. ఆర్థికపరమైన అడ్డంకుల కారణంగా అది సాధ్యం కావడం లేదని క్లబ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది చాలా బాధాకరమైన విషయమని క్లబ్ ఈ సందర్భంగా చెప్పింది. గతేడాది ఆగస్ట్‌లోనే తాను ఫ్రీ ఏజెంట్‌గా క్లబ్‌ను వీడుతానని, దీర్ఘకాలం తనకు ఆఫర్ చేయడానికి క్లబ్ దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్ లేదని మెస్సీ అప్పట్లో చెప్పాడు. అయితే కోర్టుకెళ్తామని క్లబ్ చెప్పడంతో మెస్సీ దిగి వచ్చాడు.
బార్సిలోనా క్లబ్‌కు 2000వ ఏడాదిలో 13 ఏళ్ల వయసులో తొలిసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన మెస్సీ.. ఇప్పటి వరకూ 788 మ్యాచ్‌లు ఆ క్లబ్ తరఫున ఆడాడు. బార్సిలోనా తరఫున అత్యధిక గోల్స్, మ్యాచ్‌లు మెస్సీ పేరు మీదే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30న బార్సిలోనాతో ఒప్పందం ముగియడంతో అప్పటి నుంచీ అతడు ఫ్రీ ఏజెంట్‌గా ఉన్నాడు. బార్సిలోనా క్లబ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో మెస్సీలాంటి ప్లేయర్ కాంట్రాక్ట్‌ను కొనసాగించడం కష్టంగా మారింది. ఈ మధ్యే ఇద్దరు ప్లేయర్స్‌ను వేరే క్లబ్‌లకు అమ్మేసింది. బార్సిలోనా తనను వదిలేయడంతో ఇప్పుడు మెస్సీ భవిష్యత్తు ఏంటనేది ఇంకా తేలలేదు. అతడు కూడా తన ప్లాన్స్‌పై ఇంకా ఏమీ చెప్పలేదు.
LATEST NEWS | Leo #Messi will not continue with FC Barcelona
— FC Barcelona (@FCBarcelona) August 5, 2021