ఫోర్లిడా: లియోనిల్ మెస్సి(Lionel Messi) అద్భుతం చేశాడు. లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ కొట్టాడు. ఇంటర్ మియామి క్లబ్ జట్టు తరపున ఆడుతున్న మెస్సి.. ఫిలడెల్ఫియా యూనియన్ క్లబ్‌పై స్టన్నింగ్ గోల్ కొట్టేశాడు. ఈ మ్యాచ్‌లో మియామి జట్టు 4-1 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆట 20వ నిమిషంలో గోల్ పోస్టుకు 30 గజాల దూరం నుంచి ఆ గోల్ చేశాడు. ఈ టోర్నీలో ఆరవ మ్యాచ్ ఆడిన మెస్సి.. ఇప్పటికే 9 గోల్స్ చేశాడు. మియామి జట్టు తరపున గోల్స్ కొట్టినవారిలో జోసెఫ్ మార్టినేజ్, జోర్డి ఆల్బా, డేవిడ్ రూయిజ్ ఉన్నారు. ఆట ప్రారంభమైన మూడు నిమిషాలకే మియామి జట్టు లీడ్ సాధించింది. అయితే మెస్సి కొట్టిన అద్భుతమైన ఆ గోల్‌కు చెందిన వీడియోను చూడండి.
This angle of Lionel Messi's goal for Inter Miami. 🔥pic.twitter.com/jpgW8y1Kji
— Roy Nemer (@RoyNemer) August 16, 2023
LIONEL MESSI WHAT A GOAL 🤯
— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) August 15, 2023