Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) మైదానంలో ఉంటే అభిమానులకు పండుగే. రెప్పపాటులో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిస్తూ.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటాడీ వెటరన్. తాజాగా మేజర్ లీగ్ సాకర్ (Major Soccer League) టోర్నమెంట్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. అత్యధిక గోల్స్‌కు సహకరించిన ప్లేయర్‌గా అవతరించాడీ సాకర్ మాంత్రికుడు.
న్యూయార్క్ సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో తొలి అర్ధ భాగంలోనే గోల్ చేయడంలో సాయమందించాడు మెస్సీ. తద్వారా ఎంఎల్‌సీలో 35కు పైగా గోల్స్‌లో కీలక భూమిక పోషించిన ఫుట్‌బాలర్‌గా మెస్సీ ఘనత సాధించాడు. అమెరికా లెజెండరీ ఆటగాళ్లు కార్లోస్ వెలా, లాండన్ డొనోవాన్లకు సాధ్యం కాని రికార్డుతో చరిత్రకెక్కాడీ అర్జెంటీనా సారథి.
🇦🇷 Lionel Messi in MLS this season is a masterpiece in motion!
👕 23 games
⚽️ 24 goals
🎯 11 assists
😮 60 key passes
😳 22 big chances created
💨 79 successful dribbles
💪 125 duels won
⭐️ 8.4 ratingGOAT! 🐐😳 pic.twitter.com/U8Lflu32hV
— Sholy Nation Sports (@Sholynationsp) September 25, 2025
రెండేళ్ల క్రితం ఇంటర్ మియామి (Inter Miami) క్లబ్లో చేరిన మెస్సీ తనమార్క్ ఆటతో రెచ్చిపోతున్నాడు. మైదానంలో గోల్స్ వర్షం కురిపిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకమవుతున్నాడు. 38 ఏళ్లలోనూ కుర్రాడిని తలపిస్తూ మెరుపు గోల్స్‌తో ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తున్న మెస్సీ.. వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఆడడం ఖాయమనిపిస్తోంది.
🚨BREAKING: 38yo Lionel Messi has the most Man of the Match awards in 2025.🤯🐐 pic.twitter.com/mXdFir8fYI
— MC (@CrewsMat10) September 25, 2025
ఇంటర్ మియామి తరఫున అతడు చేసిన ప్రతిగోల్.. అసిస్ట్ చేసిన ప్రతిగోల్ ఈ స్టార్ ఫార్వర్డ్‌లో చేవ తగ్గలేదని చాటుతోంది. రెండేళ్ల క్రితం అతడి సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మూడోసారి విశ్వవిజేతగా అవతరించింది అర్జెంటీనా. ఫిఫా వరల్డ్ కప్ ముందు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు భారత్‌కు రానుంది. నవంబర్ 10 నుంచి 18 మధ్య కేరళలో మెస్సీ బృందం ప్రత్యర్థి టీమ్‌తో తలపడనుంది.