తిరువనంతపురం: ఆధునిక ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు శుభవార్త. అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా జట్టు కేరళ రాకపై నెలకొన్న అనిశ్చితి వీడింది. ఈ ఏడాది నవంబర్లో కేరళకు రానున్న ఆ జట్టు.. ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నది.
మ్యాచ్కు సంబంధించిన అధికారిక తేదీ విడుదల కాకపోయినప్పటికీ నవంబర్ 12-18 మధ్య ఒకరోజు కొచ్చి వేదికగా ఇరుజట్లు ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతాయని కేరళ క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ సైతం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని ఖరారు చేయడం గమనార్హం.