హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత యువ కబడ్డీ జట్టుకు కోచ్‌గా తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23 దాకా బహ్రెయిన్‌లో జరిగే 3వ యూత్ ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోయే భారత జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి స్పోర్ట్స్ కోటాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ 2005లో భారత కబడ్డీ జట్టు తరఫున ఆడుతూ ఆసియా కబడ్డీ పోటీల్లో స్వర్ణం సాధించిన జట్టులో కీలకసభ్యుడిగా నిలిచారు.