మాంచెస్టర్: లార్డ్స్ టెస్టులో విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న ఇంగ్లండ్.. బుధవారం నుంచి భారత్‌తో మాంచెస్టర్‌లో జరగాల్సిన నాలుగో టెస్టుకు తుది జట్టును ప్రకటించింది. లార్డ్స్‌లో గాయపడ్డ స్పిన్నర్ షోయభ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్‌కు తుది జట్టులో చోటు కల్పించడం మినహా మిగతా జట్టులో మార్పులేమీ చేయలేదు. సుమారు 8 ఏండ్ల విరామం తర్వాత డాసన్.. ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. 2018 తర్వాత అతడు అంతర్జాతీయ స్థాయిలో టెస్టు ఆడనున్నాడు.
ఆసియాకప్‌పై సందిగ్ధత! ; ఏసీసీ ఏజీఎమ్‌కు బీసీసీఐ డుమ్మా
ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న ఆసియాకప్ టోర్నీపై సందిగ్ధత నెలకొన్నది. ఢాకాలో ఈనెల 24, 25వ తేదీల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) జరుగాల్సి ఉంది. పీసీబీ చైర్మన్, ఏసీసీ అధ్యక్షుడు మోహిసిన్ నక్వి సారథ్యంలో ఢాకాలో జరిగే ఏజీఎమ్‌కు హాజరయ్యేది లేదని బీసీసీఐ కుండబద్దలు కొట్టింది. ఢాకా కాకుండా వేరే వేదికలో జరిగితే అప్పుడు హాజరవుతామంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. ఏసీసీ ఏజీఎమ్‌కు కనీసం మూడు శాశ్వత సభ్యదేశాలు హాజరైతే తప్ప కోరం పూర్తికాదు.