దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో ఇండియా ఆడనున్నది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. భారతీయ క్రికెట్ అభిమానులకు రోహిత్ ఓ అపీల చేశారు. ఎప్పటి తరహాలోనే టీమిండియాకు మద్దతు ఇవ్వాలని కోరారు. చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బార్బడోస్ నుంచి తమను చాంపియన్లుగా చూస్తున్నారని, మన దేశాన్ని, జట్టును, చాంపియన్‌గా మార్చేందుకు .. మీరు మాతో ఉండాలని రోహిత్ ఆ వీడియోలో పేర్కొన్నారు. మనం అందరం చాంపియన్లు అవుదామన్నారు. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.
𝘿𝙚𝙖𝙧 #𝙏𝙚𝙖𝙢𝙄𝙣𝙙𝙞𝙖 𝙁𝙖𝙣𝙨,
“Let’s be 𝘾𝙃𝘼𝙈𝙋𝙄𝙊𝙉𝙎 together” – Rohit Sharma
WATCH 🎥🔽 #ChampionsTrophy | @ImRo45
— BCCI (@BCCI) February 20, 2025