క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇక లేడు. 52 ఏళ్ల వార్న్ తన విల్లాలో స్పృహతప్పి పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు చూశారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి, అత్యుత్తమ చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయిందని వార్న్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గుండెపోటుతోనే వార్న్ మరణించినట్లు భావిస్తున్నారు.
‘‘ఈ విషయంలో వార్న్ కుటుంబం గోప్యత పాటించాలని అనుకుంటోంది. మిగతా విషయాలన్నీ త్వరలోనే ప్రకటిస్తాం’’ అని వార్న్ మనేజ్మెంట్ పేర్కొంది. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్న షేన్ వార్న్.. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో వాడిగా ఉన్నాడు. తన కెరీర్లో మొత్తం 145 టెస్టులు ఆడిన వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేలు ఆడి 293 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.