ఢాకా: లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ ఆరు వికెట్లతో అదరగొట్టడంతో న్యూజిలాండ్తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియాను వెనక్కినెట్టిన బంగ్లా రెండో స్థానానికి ఎగబాకింది.
332 పరుగుల లక్ష్యఛేదనలో.. ఓవర్నైట్ స్కోరు 113/7తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 181 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిషెల్ (58) తప్ప మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు.