గృహహింస కేసులో భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ దోషి అని తేలింది. ముంబైలోని ఒక కోర్టులో 2014లో లియాండర్ పేస్పై ఆయన భాగస్వామి రియా పిళ్లై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్ దోషిగా తేలడంతో.. రియాకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని, అలాగే అద్దె కోసం మరో రూ.50వేలు ప్రతినెలా అందించాలని కోర్టు ఆదేశించింది.
తామిద్దరం పెళ్లి వంటి లివ్ఇన్ రిలేషన్లో ఎనిమిదేళ్లుగా ఉన్నామని, ఈ సమయంలో పేస్ తనపై పలుమార్లు గృహహింసకు పాల్పడ్డాడని రియా ఆరోపించారు. 2014లో నమోదైన ఈ కేసుపై ముంబైలోని కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పేస్ గృహహింసకు పాల్పడినట్లు రుజువైనట్లు జస్టిస్ కోమల్‌సింగ్ రాజ్‌పుత్ పేర్కొన్నారు.
నేరం రుజువైన కారణంగా రియాకు ప్రతి నెలా మెయింటెనెన్స్ కోసం రూ.లక్ష, అద్దె కోసం మరో రూ.50 వేలు చెల్లించాలని పేస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో రియా కనుక పేస్‌తోనే కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఎటువంటి ఆర్థిక సహకారం ఇవ్వనక్కర్లేదని తెలిపింది. ఎందుకంటే పేస్ టెన్నిస్ కెరీర్ దాదాపు ముగిసిన కారణంగానే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది.