అహ్మదాబాద్: ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు అహ్మదాబాద్‌కు చెందిన వెటరన్ పవర్‌లిఫ్టర్ లలిత్ పటేల్. థాయ్‌లాండ్‌లోని పట్టాయలో జరిగిన ఐబీబీఎఫ్ వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో లలిత్ మూడు స్వర్ణ పతకాలతో మెరిశాడు. మాస్టర్2 కేటగిరీ(83-93కి)లో పోటీపడ్డ పటేల్..బ్రెంచ్ప్రెస్, డెడ్‌లిఫ్ట్, స్వాట్ ఈవెంట్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మెగాటోర్నీ కోసం లలిత్ ఎనిమిది నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఐదేండ్ల కిందట పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా తీసుకున్న లలిత్ అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయి లో సత్తాచాటాడు.