న్యూఢిల్లీ: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్యసేన్, సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ ఆధ్వర్యంలో భారత షట్లర్ల బృందం పాల్గొననున్నది. మలేషియా వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు జరుగనున్న ఈ టోర్నీలో పురుషుల బృందానికి లక్ష్య, మహిళల బృందానికి మాళవిక ప్రాతినిథ్యం వహించనున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శనివారం ప్రకటించింది. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన వారిని పరిగణనలోకి తీసుకున్నామని బాయ్ కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపారు.
ఈ టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు వీళ్లే..
పురుషుల సింగిల్స్
లక్ష్యసేన్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రఘు
పురుషుల డబుల్స్
రవికృష్ణ-ఉదయ్‌కుమార్, హరిహరన్-రుబన్ కుమార్, డింకు సింగ్-మన్జిత్ సింగ్
మహిళల సింగిల్స్
మాళవిక బన్సోద్, ఆకర్శి కశ్యప్, అష్మిత చలిహా, తారా షా
మహిళల డబుల్స్
సిమ్రాన్ సింఘి-ఖుషీ గుప్తా, నీలా-అరుబాల, ఆర్తి సారా-రిజా మెహ్రీన్.