China Masters : పారిస్ ఒలింపిక్స్‌లో కొద్దిలో కాంస్యం చేజార్చుకున్న లక్ష్యసేన్(Lakshya Sen) తన రాకెట్ పవర్ చూపించాడు. చైనా మాస్టర్స్‌లో చెలరేగిన ఈ భారత కెరటం అలవోకగా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపిన లక్ష్యసేన్ డెన్మార్క్ ఆటగాడు రస్మస్ జెమ్కేను వరుస సెట్లలో చిత్తు చేశాడు. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) ఊహించని పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రస్మన్ జెమ్కేతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ తొలి సెట్ నుంచి పైచేయి సాధించాడు. రెండు సెట్లలో జోరు చూపించిన లక్ష్యసేన్ 21-6, 21-18తో సులువుగా గెలుపొందాడు. సెమీస్ బెర్తు కోసం అతడు తకుమా ఒబయాషి(జపాన్), అండెర్స్ అంటోన్సేన్(డెన్మార్క్) మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు.
ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధుకు మళ్లీ పరాజయం తప్పలేదు. 19వ ర్యాంకర్ అయిన సింధు సింగపూర్ క్రీడాకారిణి యో జియా మిన్ (Yeo Jia Min) ధాటికి నిలువలేకపోయింది. గంట 9 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు గట్టగానే పోరాడింది. కానీ, జియా మెన్ పట్టు విడువకపోవడంతో 16-21, 21-17, 21-23తో ఓటమి పాలైంది.