BGT 2024-25 : ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించాలనుకుంటున్న భారత జట్టుకు రేపే తొలి సవాల్ ఎదురుకానుంది. ఆతిథ్య దేశపు గడ్డమీద బోర్డర్ – గవాస్కర్ (Border – Gavaskar) ట్రోఫీ సమరానికి పెర్త్ స్టేడియం వేదికగా శుక్రవారం తెర లేవనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో ఉన్న ఇరుజట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకని గెలుపే లక్ష్యంగా భారత్, ఆసీస్‌లు తలపడడం ఖాయం. కానీ, పెర్త్ అంటేనే భారత జట్టుకు అచ్చిరాని మైదానం. మర్చిపోలేని పీడకలల్ని మిగిల్చిన పెర్త్‌లో విజయం కోసం టీమిండియా నిరీక్షిస్తోంది.
ప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే ఆడుతున్న భారత్.. ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కొని చరిత్ర సృష్టిస్తుందా? అనేది చూడాలి. ఇక పెర్త్ స్టేడియంలో ఆధిపత్యం చలాయిస్తున్న కంగారూ జట్టు మరో విజయంపై దీమాతో ఉంది. అసలు ఈ స్టేడియంలో గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?
📸📸
Getting Perth Ready 🙌#TeamIndia | #AUSvIND pic.twitter.com/E52CHm1Akv
— BCCI (@BCCI) November 19, 2024
స్వదేశంలో ప్రతి జట్టుకు ఓ మైదానం బాగా కలిసొస్తుంది. అక్కడ తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొడుతాయి ఆతిథ్య జట్లు. ఆస్ట్రేలియా విషయానికొస్తే పెర్త్ కూడా అలాంటిదే. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమిండియాను మూడుసార్లు ఓటమే పలకరించింది. 2008లో ‘మంకీగేట్ స్కాండల్’ అనంతరం జరిగిన ఆ టెస్టులో భారత జట్టు 72 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది.
అయితే.. కొత్తగా నిర్మించిన పెర్త్ ఆప్టస్ స్టేడియంలో మాత్రం గెలుపు సంతకం చేయలేకపోయింది.
గెలుపు సంబురాల్లో భారత ఆటగాళ్లు
ఈ మైదానంలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ నాలుగింట జయభేరి మోగించింది. అంతేకాదు ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లనే నాలుగు పర్యాయాలు విజయం వరించింది. మరో విషయం ఏంటంటే.. టాస్ గెలిచిన జట్టుకే పెర్త్‌లో పైచేయి అయింది. పర్యాటక బ్యాటర్లకే కాదు సొంత దేశపు ఆటగాళ్లకు కూడా సవాల్ విసిరే ఈ పిచ్ మీద శతకం బాదిన వీరుడు ఒకే ఒక్కడు. అతడే.. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli). అతడి తర్వాత ఏ ఒక్కరూ కూడా పెర్త్‌లో మూడంకెల స్కోర్ అందుకోలేకపోయారు.
1. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ కొట్టిన జట్టు ఆస్ట్రేలియా. 2022 నవంబర్‌లో వెస్టిండీస్‌పై ఆసీస్ 598-4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పెర్త్‌లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.
2. పెర్త్ పిచ్ మీద నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్.. 333. విండీస్ జట్టు 2022 నవంబర్‌లో ఈ రికార్డు నమోదు చేసింది.
3. పెర్త మైదానంలో సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2014లో విరాట్ 123 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
4. ఈ పిచ్ మీద ఇప్పటికీ ఫాస్ట్ బౌలర్ల ధాటికి 102 వికెట్లు నేలకూలాయి. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అందరికంటే ఎక్కువగా 23 వికెట్లు తీశాడు. ఈ మిస్సైల్ స్టార్క్ ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు.
5. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే.. వాళ్ల ఖాతాలో 37 వికెట్లు ఉన్నాయి. ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 23 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.
6. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం భారత పేసర్ షమీవే. ఈ స్పీడ్‌స్టర్ 2018లో తన తడాఖా చూపిస్తూ 24-8-56-6తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.