US Open : యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్(Indian Shuttlers) లక్ష్యసేన్(Lakshya Sen) జైత్రయాత్ర కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో అతను సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. భారత్‌కే చెందిన 19 ఏళ్ల ఎస్ శంకర్ ముత్తుస్వామి(S Sankar Muthusamy)ని క్వార్టర్ ఫైనల్లో ఓడించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్ 21-10 21-17తో ముత్తుస్వామిపై గెలుపొందాడు.
సెమీస్‌లో లక్ష్యసేన్ చైనా క్రీడాకారుడు లీ షి షెంగ్(Li Shi Feng)తో ఢీ కొట్టనున్నాడు. ఈమధ్యే ముగిసిన కెనడా ఓపెన్(Canada Open 2023) లక్ష్యసేన్, లీ షి షెంగ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. దాంతో, వీళ్లిద్దరి మధ్య ఈసారి తగ్గపోరు ఉండనుంది.
మరోవైపు.. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు(PV Sindhu) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె ఓడిపోయింది. చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ(Gao Fang Jie) చేతిలో 20-22, 13-21తో ఓటమి పాలైంది. ఇప్పటివరకూ వీళ్లద్దరూ ఐదుసార్లు తలపడ్డారు.
పీవీ సింధు
ఫాంగ్ నాలుగు విజయాలతో సింధుపై పై చేయి సాధించింది. ఈ సీజన్లో సింధు సెమీ ఫైనల్ చేరకపోవడం వరుసగా ఇది రెండోసారి. కెనడా ఓపెన్‌లోనూ ఆమె క్వార్టర్స్‌లోనే ఇంటి దారి పట్టింది. మలేషియా ఓపెన్‌తో మొదలు క్వార్టర్స్ ఫోబియా సింధును వెంటాడుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మునపటలా ఆడలేకపోతోంది.