సిడ్నీ: ఇద్దరు భారత షట్లర్ల మధ్య జరిగిన క్వార్టర్స్ పోరులో లక్ష్యసేన్‌దే పైచేయి అయింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో లక్ష్య.. 23-21, 21-11తో భారత్‌కే చెందిన ఆయూశ్ శెట్టిపై విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఇరువురి మధ్య 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో కాస్త ప్రతిఘటించిన ఆయూశ్.. రెండో గేమ్‌లో మాత్రం తేలిపోయాడు.
సెమీస్‌లో లక్ష్య.. ప్రపంచ 9వ ర్యాంకర్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)ని ఢీకొననున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పోరాటం కూడా క్వార్టర్స్‌లోనే ముగిసింది. భారత ద్వయం.. 19-21, 15-21తో ఇండోనేషియాకు చెందిన ఐదో సీడ్ ఫజర్ అల్ఫియాన్-మహ్మద్ షోహిబుల్ ఫిక్రీ చేతిలో పరాభవం పాలయ్యారు.