Japan Open : జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్లకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (PV Sindhu) తొలి రౌండ్లోనే నిష్క్రమించగా.. లక్ష్య సేన్(Lakshya Sen), సాత్విక్ – చిరాగ్ ఆమెను అనుసరిస్తూ ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఎనిమిదో ర్యాంకర్ సేన్ తేలిపోయాడు. స్థానిక ఆటగాడు కొడాయ్ నరొకా (Kodai Naraoka) చేతిలో 19-21, 11-21తో అనూహ్యంగా కంగుతిన్నాడు.
డబుల్స్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం తొలి రౌండ్లో అద్భుత విజయం సాధించింది. అయితే.. రెండో రౌండ్లో మాత్రం ఐదో సీడ్ జంట ధాటికి చేతులెత్తేసింది భారత జోడీ. గురువారం హోరాహోరీగా జరిగిన పోరులో లియాంగ్ వీ కెంగ్ వాంగ్ చాంగ్ (చైనా) జంటకు బదులివ్వలేకపోయింది చిరాగ్ ద్వయం.
Lakshya Sen 🇮🇳 goes up against Kodai Naraoka 🇯🇵.#BWFWorldTour #JapanOpen2025 pic.twitter.com/yv9VtFRhRf
— BWF (@bwfmedia) July 17, 2025
తొలి సెట్లో గట్టిగానే పోరాడినా..22-24తో వెనకబడింది. రెండో సెట్లో పుంజుకుంటారనుకుంటే బలహీనమైన డిఫెన్స్ కారణంగా 14-21తో దారుణ ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో చైనీస్ షట్లర్లు భారత స్టార్లపై తమ విజయాల ఆధిక్యాన్ని 7-2కు పెంచుకున్నారు.